BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, January 25, 2011

ఏ డ్రెస్‌కి ఎంత ఎక్స్‌పోజింగ్ వుంటుందో నాకు తెలుసు అంటున్న హీరోయిన్

ఏ డ్రెస్‌కి ఎంత ఎక్స్‌పోజింగ్ వుంటుందో నాకు తెలుసు అంటున్న హీరోయిన్

 Samanthaగత సంవత్సరం తెలుగు తెరకు పరిచయమైన కథానాయికల్లో ఒక్క చిత్రంతోనే అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న తారల్లో సమంత ఒకరు. తొలి చిత్రం ఏమిమాయ చేశావేలో చీరకట్టులో హోయలు ఒలికించి, మలి చిత్రం బృందావనంలో గ్లామర్‌డోసును పెంచిన ఈ చెన్నై భామ ఆ రెండు చిత్రాల ద్వారా విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు సరసన దూకుడు అనే సినిమాలో నటిస్తున్నారు.

మహేష్ ‌బాబు కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. ఈ చిత్రంలో గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రను చేస్తున్నారట సమంత. అయితే గ్లామర్ విషయంలో మీ అభిమతం ఏమిటని ఈ తారను ప్రశ్నిస్తే- ‘‘గ్లామర్ విషయంలో నాకు కొన్ని హద్దులున్నాయి. అయినా నాలో వున్న గ్లామర్ మొత్తం ఒకే సినిమాలో ప్రదర్శిస్తే ఇక తదుపరి చిత్రాల్లో చూపించటానికి ఏమీ వుండదు.

అందుకే అవసరానికి తగ్గట్టు, పాత్రకు తగ్గట్టు లెక్కలేసుకొని మరీ గ్లామర్ పండిస్తాను. చిత్రంలోని నా పాత్ర, సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు తప్పక గ్లామరస్‌గా కనిపించటానికి ప్రయత్నిస్తాను. అందుకే నా తొలిచిత్రంలో పాత్రను బట్టి చీరకట్టులో కనిపిస్తే, రెండో చిత్రంలో మోడ్రన్ అమ్మాయిగా కనిపించాను.

అయితే ఈ విషయంలో ప్రేక్షకులు చూసే కోణంలోనూ, దర్శకుడు చూపించే విధానంలోనూ గ్లామర్ డోసు ఆధారపడి వుంటుంది. ఏ సన్నివేశంలో ఏ డ్రెస్‌కి ఎంత ఎక్స్‌పోజింగ్ వుంటుందో కూడా నాకు తెలుసు’’ అంటూ చెప్పారు ఈ ముద్దుగుమ్మ.

No comments:

Post a Comment