ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, January 17, 2011
ఏప్రిల్ ఫస్ట్ న తన శక్తి చూపిస్తానంటోన్న జూ ఎన్టీఆర్...
ఏప్రిల్ ఫస్ట్ న తన శక్తి చూపిస్తానంటోన్న జూ ఎన్టీఆర్...
ఎట్టకేలకు నిర్మాతల మండలి షూటింగ్ లు చేసుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆల్రెడీ కొన్ని చిత్రాల షూటింగులు మొదలయ్యాయి. ఈ జాబితాలో జూ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘శక్తి’ కూడా వుంది. ప్రస్తుతం శక్తి దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ భోగి రోజున శక్తి షూటింగ్ దుబాయ్ లోమోదలైంది. శక్తి చిత్ర యూనిట్ మొత్తం ప్రస్తుతం దుబాయ్ లో వున్నారు. ఇలియానా కథా నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మొహర్ రమేష్ దర్శకుడు.
భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో జూ ఎన్టీఆర్, ఇలియానాపై రెండు పాటలు చిత్రీకరిస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయటానికి నిర్మాత అశ్వనీదత్ సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం. అలాగే ఈ చిత్రంతో జూ ఎన్టీఆర్ కి ఒక మెగా మార్క్ ఇవ్వాలనే ఆరాటంతో చాలా పెద్ద మొత్తం తో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి చాలా ఉత్సాహం కలిగించే విధంగా మాస్ టు మాస్ గా రికార్డ్ బద్దలు చేస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
No comments:
Post a Comment