ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, January 17, 2011
చిరంజీవి తాతను బూతుల నాయుడు అనే వాళ్లం
చిరంజీవి తాతను బూతుల నాయుడు అనే వాళ్లం..
మెగాస్టార్ చిరంజీవి తాతను బూతుల నాయుడు మేము అనే వాళ్లం అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ నటుడు కృష్ణంరాజు. ఆయన నిన్న(ఆదివారం) రాత్రి ఓ టీవీ ఛానెల్ తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఇలా అనేవాళ్ళం అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవిది మీ ఊరే కదా...ఎప్పుడైనా కలిసేవారా అని అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు. అలాగే చిరంజీవి..మా తమ్ముళ్లకు తెలుసు గానీ, నాకు అప్పట్లో పరిచయం లేదు. కలవలేదు. మద్రాసులోనే కలిశాను. వాళ్ల గ్రాండ్ పేరెంట్స్ బాగా తెలుసు అన్నారు. ఇక చిరంజీవిది, కృష్ణంరాజుదీ పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామం. ఇక కృష్ణరాజుని మీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటి అని అడగగా..అందరూ గుర్తు పెట్టుకునేలా పిచ్చిపుల్లయ్య, బీదల పాట్లు అనే రెండు మంచి ఎన్టీఆర్ తీశారు. సత్యజిత్ రే తీసిన లాంటి సినిమాలు తీయాలన్న ఉద్దేశం ఉంది. దేశ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకురావాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను అన్నారు.అలాగే తన వారసుడు హీరో ప్రభాస్ అన్నారు.
No comments:
Post a Comment