ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, January 17, 2011
హైదరాబాదులోని మాదాపూర్ వైన్ షాపులో రూ. 33 లక్షల చోరీ
హైదరాబాదులోని మాదాపూర్ వైన్ షాపులో రూ. 33 లక్షల చోరీ.....
హైదరాబాద్: హైదరాబాదులోని మాదాపూర్‌లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. దొంగలు మాదాపూర్‌లోని ఓ వైన్ షాపులో 33 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. షాపు యజమాని, తన దుకాణంలో పనిచేసేవారితో కలిసి దుకాణం మూసి వెళ్తున్న సమయంలో ఈ చోరీ జరిగింది. ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చిన దొంగతనానికి పాల్పడ్డారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాపులో పనిచేసేవారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. షాపు యజమాని మాత్రం తన దుకాణంలో పనిచేసే సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. తాము దుండగులను ఎదిరించలేక పారిపోయామని సిబ్బంది చెబుతున్నారు.
No comments:
Post a Comment