ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, January 17, 2011
ఏటిఎంలో రూ.20 లక్షలు చోరీ: ఆలస్యంగా వెలుగులోకి ఘటన
ఏటిఎంలో రూ.20 లక్షలు చోరీ: ఆలస్యంగా వెలుగులోకి ఘటన....
హైదరాబాద్: రాజధాని నగరంలోని ఓ ఏటీఎం కేంద్రంలో రెండు రోజులు క్రితం భారీ దోపిడి జరిగింది. అయితే సంఘటనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15వ తారీఖున హైదరాబాదులోని సైదాబాదు ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటిఎం కేంద్రంలో 20 లక్షల రూపాయలు దోపిడీకి గురయ్యాయి. 20 లక్షలా అంతకంటే ఎక్కువ పోయిందా అనే నిర్ధారణకు ఇంకా అధికారులు రాలేదు. అంతకంటే ఎక్కువ కూడా పోవచ్చునని భావిస్తున్నారు.
ఎటిఎంలో చోరీ శనివారం జరగగా ఆదివారం రాత్రి అధికారులు చోరీ జరిగినట్టు గుర్తించారు. ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డట్టు వీడియోకాం ద్వారా తెలుసుకున్నారు. చోరీ చేసిన వ్యక్తి కూడా దొంగతనం చేయడానికి చిన్న స్ర్కూడ్రైవర్ మాత్రమే వాడాడు.
No comments:
Post a Comment