ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, February 1, 2011
పోస్ట్ స్క్రీనింగ్‌కు ముందే డివిడిని దొంగతనం చేసిన దొంగలు
పోస్ట్ స్క్రీనింగ్‌కు ముందే డివిడిని దొంగతనం చేసిన దొంగలు
హాలీవుడ్ చరిత్రలో నిలచిపోయేటటువంటి సినిమాలు తీసిన దర్శకుడు మెల్ గిబ్సన్. అలాంటి మెల్ గిబ్సన్ లాస్ ఏంజిల్స్ ఇంట్లో తన కొత్త సినిమా ది బేవర్‌కు సంబంధించినటువంటి డివిడి కాపీ దోంగలు దోంగతనం చేశారని మెల్ గిబ్సన్ పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే సమ్మిట్ ఎంటర్ టైన్ మెంట్‌కి సంబంధించినటువంటి ప్రోడక్షన్ బాసెస్ ఓ డివిడి కాపీని మెల్ గిబ్సన్ కోసం ప్రత్యేకంగా పంపండం జరిగింది. ది బేవర్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలను జోడి పోస్టర్‌కు అప్పగించారు మెల్ గిబ్సన్.
త్వరలో సౌత్ వెస్ట్ ఫిలిం ఫెస్టివల్ ఆస్టిన్‌లో జరగనున్న తరుణంలో ఈసినిమాని అక్కడ ప్రీమియర్ షోగా ప్రదర్శించునున్నారు. అందులో భాగంగానే సినిమాని ఫైనల్ మెల్ గిబ్సన్ చూసి ఓకే చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఓ కాపీ మెల్ గిబ్సన్ పంపడం జరిగందన్నారు. దీనిని చూసినటువంటి మెల్ గిబ్సన్ దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లును సరిచేసి తన ఇంట్లో ఉన్నటువంటి మెయిల్ బాక్స్‌లో ఉంచడం జరిగింది. అటుతర్వాత కోరియర్ బాయ్‌కు ఫోన్ చేసి కోరియర్‌ని తీసుకెళ్లవలసిందిగా కోరడం జరిగంది. కొరియర్ బాయ్ వచ్చి దీనిని కలెక్టు చేసేకునే లోపల డివిడిని ఎవరో దుండగులు దోంగలించడం జరిగిందన్నారు.
దీనిపై మెల్ గిబ్సన్ లాస్ ఏంజిల్స్ లో ఉన్నటువంటి లోకల్ పోలీసులకు విషయం క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దీనిపై ఇన్విస్టిగేటింగ్ మొదలు పెట్టినటువంటి లోకల్ పోలీసులు త్వరలోనే విషయం తేలస్తామన్నారు.
No comments:
Post a Comment