BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, February 1, 2011

విశాఖలో అర్థరాత్రి రింగ రింగా హీరోయిన్ విమల హైడ్రామా

విశాఖలో అర్థరాత్రి రింగ రింగా హీరోయిన్ విమల హైడ్రామా

 Vishakapatnamవిశాఖపట్నం: రింగ రింగా సినిమా హీరోయిన్ విమల సోమవారం అర్థరాత్రి విశాఖపట్నంలో హైడ్రామా సృష్టించారు. ప్రశాంత్ అనే యువకుడు తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పి ప్రశాంత్ అనే యువకుడు ఓ దర్శకుడి పేరు చెప్పి తనను లాడ్జీకి ఆహ్వానించాడని, తాను లాడ్జికి వెళ్లానని, దాంతో అతను తనపై దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ తన వెంట పడుతున్నాడని కూడా ఆమె ఆరోపించారు. తనకు మత్తు మందు ఇచ్చాడని, తన జుట్టు కత్తిరించాడని, ఆ తర్వాత దాడి చేశాడని ఆమె పోలీసులకు చెప్పారు.

పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో విమల మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంపై చిన్ని చిన్న గాట్లు ఉన్నాయని వారు చెప్పారు. ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, విమల ఫిర్యాదులోని నిజానిజాలను తెలుసుకోవడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. విమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రచారం కోసమే విమల నాటకమాడుతోందా అనే కోణం నుంచి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు విమల ఇంతకు ముందు రెండు తమిళ సినిమాల్ోల నటించారు. ప్రస్తుతం రింగ రింగా సినిమాలో నటిస్తున్నారు.

No comments:

Post a Comment