ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, February 1, 2011
ఫ్యామిలి సంతతిని అభివృద్ది చేసుకోవాలనే ఆలోచన లేదంటున్న హీరోయిన్
ఫ్యామిలి సంతతిని అభివృద్ది చేసుకోవాలనే ఆలోచన లేదంటున్న హీరోయిన్
హాలీవుడ్‌లో అందమైన జంట ఏంజిలీనా జోలి మరియు బ్రాడ్ పిట్‌ల తర్వాత వాళ్శలాగే అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి జంట సూపర్ మోడల్ హైదీ క్లూమ్ మరియు సీల్. వీరిద్దరికీ ఓ ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకత అని అనుకుంటున్నారా వీరిద్దరూ సింగర్స్ కావడమే. వాళ్శకు పుట్టినటువంటి పిల్లలకు ఎనలేని ప్రేమను కనబరుస్తారు ఇద్దరు స్టార్లు. వీరిద్దరి ప్రేమకు వీరికి నలుగురు పిల్లలు పుట్టడం జరిగింది. ఇంతటితో ఫ్యామిలీని నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు హైదీ క్లూమ్ వెల్లడించారు.
ఈసందర్బంలో హైదీ క్లూమ్ మాట్లాడుతూ నాకు తెలిసి నలుగురు పిల్లలు అనేది చాలా పెద్ద విషయం. మేము ఏంజిలీనా జోలి, బ్రాడ్ పిట్ లాంటి జంట కాదు. ఎందుకంటే వారు వారియొక్క ప్యామిలీని వృధ్ది చేసుకొవాలనే ఉద్దేశ్యంతో ఉన్నవారు కాబట్టి ఎక్కవమంది పిల్లలను కనడం, దత్తతు తీసుకోవడం జరిగింది. హైదీ క్లూమ్ గతంలో విక్టోరియా సీక్రెట్ ఏంజిల్స్ రియాలిటీ షోలో పాల్గోన్న విషయం తెలిసిందే.
ఇకపోతే వచ్చే నెలలో హైదీ క్లూమ్ సీరియస్లీ ఫన్నీ కిడ్స్ అనే లైఫ్ టైమ్ సిరీస్‌ను ప్రారంభించనున్నారు. ఈషోలో హైదీ క్లూమ్ చాలా మంది పిల్లలతో కలసి నటించనున్నారని సమాచారం. ఈ ముప్పై ఏడు సంవత్సరాల సూపర్ మోడల్ హైదీ క్లూమ్ ఇటీవల మాట్లాడుతూ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి ముందు ఎటువంటి అసభ్యకరమైన పదజాలం మాట్లాడనని అన్నారు. వారిని ఎంతో అపురూపంగా చూచుకోవడం జరుగుతుందని హైదీ క్లూమ్ అన్నారు.
No comments:
Post a Comment