ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, February 1, 2011
గోవా బ్యూటీ ఇలియానా భోరున ఏడ్చేసిన కారణం
గోవా బ్యూటీ ఇలియానా భోరున ఏడ్చేసిన కారణం
రీసెంట్ గా ఇలియానా నేను నా రాక్షసి చిత్రం కోసం ఇలియానా ఏడ్చారు.అయితే ఆమె ఏడుపుకి కారణం అందులో సీన్ కాదు. ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వడమే. రానా, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన చివరి సీన్ తీయడం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ పేకప్ చెప్పగానే...ఇలియానా చాలా భోరున ఏడ్చేసింది. ఆ విషయం గురించి ఆమె చెబుతూ పోకిరి తర్వాత మళ్లీ పూరీతో చేసిన చిత్రం ఇది. ఆయనతో రెండో సినిమా చేయడం అనేది నా కల. ఈ చిత్రంలో పూరి నాకు మంచి పాత్ర ఇచ్చారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రానా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రానా సెట్లో ఉంటే ఎంతో సందడిగా ఉంటుంది. అలా ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగిందో కూడా తెలియలేదు. అప్పుడే పూర్తయ్యిందా అనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఈ యూనిట్‌తో నా ప్రయాణం చాలా సాఫీగా, ఆనందంగా సాగింది. అందుకే ఈ చిత్రం నాకు చాలా చాలా ప్రత్యేకం. నేను నా రాక్షసి విడుదల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. పూరి, నా కాంబినేషన్‌లో రూపొందిన పోకిరి ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. మళ్లీ మా కాంబినేషనలో మరో సక్సెస్ చవి చూడబోతున్నాం అన్నారు.
No comments:
Post a Comment