BREAKING NEWS
Tuesday, February 1, 2011
నా గెటప్‌లో నువ్వు చాలా బాగున్నావ్ అన్న సూపర్ స్టార్
బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుంది ప్రియాంక చోప్రా. ప్యాషన్ సినిమాలో తనలోని నటనా విశ్వరూపాన్ని సినీ అభిమానులకు చూపించారు. ఇటీవల జరిగిన ఓ అవార్డ్స్ వేడుకలో ప్రియాంక దాదాపు ఆరు రకాల గెటప్స్‌లో కనిపించి అలరించారు. ‘‘అరే.. ప్రియాంకా... నువ్వింత అందంగా ఉంటావనుకోలేదు. నా గెటప్‌లో నువ్వు చాలా బాగున్నావ్’’.. అని ఇటీవల జరిగిన ఓ అవార్డ్ వేడుకలో ప్రియాంక చోప్రాను అభినందించారు షారుక్ ఖాన్. ప్రేక్షకుల మధ్యలో కూర్చుని వేదిక మీద ఉన్న ప్రియాంకను ఉద్దేశించి ఆయన అన్న ఈ మాటలకు చప్పట్లతో ఆ ప్రాంగణం హోరెత్తిపోయింది. ‘కింగ్ ఖాన్’ అందించిన ఈ కాంప్లిమెంట్స్‌కు ప్రియాంక తెగ ఆనందపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment