ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, February 1, 2011
లీగల్ వివాదంలో అనుష్క..రమా రాజమౌళి???
లీగల్ వివాదంలో అనుష్క..రమా రాజమౌళి???
ప్రముఖ దర్శకుడు రాజమౌళి భార్య రమా రాజమౌళి, హీరోయిన్ అనుష్క ఓ లీగల్ చిక్కులో ఇరుక్కుని వైజాగ్ కోర్టుకి హాజరు కావాల్సిన పరిస్దితి వచ్చిందని సమాచారం. వీరిద్దరూ కలిసి వైజాగ్ లోని మధురవాడ ప్రాంతంలో ఓ ల్యాండ్ ని కొనుగోలు చేసారు. అయితే రాంగ్ పవర్ ఆఫ్ అటార్నీతో ఆ స్ధలాన్ని తీసుకున్నారంటూ వీరిద్దరపై నారాయణ అనే వ్యక్తి పిటీషన్ ధాకలు చేసారు. దాంతో వైజాగ్ కోర్టు వీరిని జనవరి 28 వ తేదీన కోర్టుకి హాజరు కావాలని ఆదేశించింది. అయితే అనుష్క, రమ ఇద్దరూ..హైకోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని వైజాగ్ కోర్టుకి హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ కేసు మళ్ళీ పిబ్రవరి 18వ తేదీన హియరింగ్ కి రానుంది.
No comments:
Post a Comment