BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, April 7, 2011

పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ కి హ్యాండ్ ఇచ్చిన గీతాఆర్ట్స్...!

Teen Maar మెగా కాంపౌండ్ నుండి ఓ సినిమా వస్తోందంటే..ఆ సినిమా గురించి అల్లు అరవింద్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అతనే ముందుండి అన్ని చూసుకుంటాడు. కానీ అందుకు బిన్నంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాని నిర్మించకపోతే కనీసం ఒక్క ఏరియాకైనా దాని పంపిణీ హక్కులు తీసుకునే అల్లు అరవింద్ ‘తీన్ మార్’ చిత్రానికి దూరంగా ఉన్నాడు. ‘తీన్ మార్’ చిత్రాన్ని ఏ ఏరియాకి కూడా గీతా డిస్ట్రిబ్యూషన్ హౌస్ పంపిణీ చేయడం లేదు. చాలా చోట్ల కొత్త, లేదా అంతగా అనుభవం లేని డిస్ట్రిబ్యూటర్లే ఈ చిత్రాన్ని కొన్నారు. ఎక్కడైనా కాస్త లాభం వచ్చే అవకాశం ఉందనిపిస్తే వదులుకోని అల్లు అరవింద్ ఈ చిత్రానికి దూరంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ తో అతనికి విభేధాలొచ్చిన విషయం మళ్లీ హైలైట్ అయింది.

ఏదో నామ్ కే వాస్తేగా తీన్ మార్ ఆడియో రిలీజ్ కి వచ్చిపోయిన అల్లు అరవింద్ అంతటితోనే ఆగిపోయాడు. కేవలం అల్లు అరవింద్ మాత్రమే కాకుండా గీతా ఆర్ట్స్ సినిమాల్ని వేరే ఏరియాల్లో ఎక్కువగా పంపిణీ చేసే వాళ్లు కూడా తీన్ మార్ కి దూరంగానే ఉన్నారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన బద్రినాథ్, సమర్సించిన 100%లవ్ పై మాత్రమే అల్లు అరవింద్ దృష్టి పెట్టాడు. మరి పవన్ కళ్యాణ్ కి హ్యాడ్ ఇవ్వడంలో ఆంతర్యమేమిటో....!

No comments:

Post a Comment