భారత క్రికెట్ జట్టు కాసనోవా యువరాజ్ సింగ్ తాజాగా బాలీవుడ్ నటి అమీషా పటేల్‌తో రోమాన్స్ నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కిమ్ శర్మ, దీపికా పడుకోనేలతో అపైర్స్ నడిపిన యువీ ఇప్పుడు అమీషా పటేల్‌ను ఎంచుకున్నాడు. భారత, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచుకు అమీషా పటేల్ యువీ ప్రత్యేక అతిథిగా వచ్చింది. యువీ బౌలింగ్ చేస్తున్నప్పుడు అమీషా తన చీర్స్‌తో ఉత్సాహపరుస్తూ వచ్చింది. యువీ రన్నవుటయ్యే ప్రమాదాన్ని ఎదుర్కున్నప్పుడు అమీషా పెద్ద పెట్టున అరించిందట. పక్కనే ఉన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, రణబీర్ కపూర్ ఆమె వైపు చూస్తూ ఆశ్చర్యపోయారని అంటున్నారు.
యువీ బాలీవుడ్ తారలతో ప్రేమాయణాలకు పెట్టింది పేరుగా మారాడు. గతంలో కిమ్ శర్మతో డేటింగ్ చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడని కూడా భావించారు. అయితే, అనూహ్యంగా ఇరువురి మధ్య బెడిసికొట్టింది. ఆ తర్వాత దీపికా పడుకొనేతో వ్యవహారం నడిపాడు. యువీ బర్త్ డే వేడుకల్లో పాల్గొనడానికి దీపికా పడుకొనే రెక్కలు కట్టుకుని ఆస్ట్రేలియాలో వాలింది.
No comments:
Post a Comment