BREAKING NEWS
Thursday, April 7, 2011
ఆమెతో స్టార్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ లవ్ స్టోరీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో చిత్రానికి తెర తీస్తున్నారు. ఆ చిత్రం పేరు లవ్ స్టోరి.మహిగిల్ అనే బాలీవుడ్ హీరోయిన్ తో ఆయన ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారు.లేడి ఓరియెంటెడ్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.హిందిలో మొదట చిత్రీకరించి ఆ తర్వాత దాన్ని తెలుగు,తమిళ బాషల్లో డబ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.మొదట ఆయన భారీ బడ్జెట్ తో డిపార్టమెంట్ చిత్రం ప్లాన్ చేసారు.కానీ దాన్ని పెండింగ్ పెట్టి ఈ ప్రాజెక్టుని భుజాన ఎత్తుకున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ విషయమై మహీగిల్ మాట్లాడుతూ..నన్ను రామ్ గోపాల్ వర్మ పిలిచి మాట్లాడారు.అయితే ఏ ప్రాజెక్టూ కన్ఫర్మ్ కాలేదు అంది.ఈ చిత్రం ఈ నెలాఖరుకు సెట్స్ మీదకు వెళ్ళనుంది.అయితే వర్మే ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారా లేక ఆయన అశోసియేట్స్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment