మెహర్ రమేష్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నటించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘శక్తి’. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో అల్లు శిరీష్ చాలా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘మగధీర’ రికార్డులను బ్రేక్ చేస్తుంది. అనే ఊహాగానాలతో విడుదల కావడంతో సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ చిత్రం ఏప్రిల్ 1వ తేదిన విడుదల చేసి అందరినీ బాగానే ఫూల్స్ ని చేశారు. ఆ రోజు చిత్రం చూసి నిజంగానే ఫూల్ ని అయ్యానని అల్లు శిరీష్ చెప్తున్నాడు.
ఈ చిత్రంలో బాడీ బాగా ఉన్న వారికే కత్తి తిప్పే సన్నివేశాలు సూట్ అవుతాయని, ‘శక్తి’ చిత్రంలో ఎన్టీఆర్ కు తగిన బాడీ బిల్డ్ లేకపోవడంతో చొక్కా వేసుకుని కత్తి తిప్పడం కామెడీగా అనిపించిందని చెప్తున్నాడు శిరీష్. కండల వీరులకే కత్తి తిప్పే అర్హత ఉందని..అల్లు అర్జున్, రామ్ చరణ్ ల ఫోటోలను చూపించాడు. ఈ విధంగా శక్తి చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఎన్టీఆర్ లోని లోపాలను వేలెత్తి చూపిస్తున్నాడు శిరీష్. అయితే తర్వాత తన అన్న బన్ని ‘బద్రీనాథ్’ చిత్రం విడుదవుతోంది. మరి ఈ చిత్రం గురించి ఏ కామెంట్స్ చవిచూస్తాడో వేచి చూడాల్సిందే..
No comments:
Post a Comment