అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యం బాగుపడిందని డాక్టర్ల బృందం గురువారం మధ్యాహ్నం తెలిపింది. సత్యసాయికి రక్త పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్ష నిర్వహించి నిర్ధారణ చేసుకున్న తర్వాత సాయికి డయాలసిస్ నిలిపి వేయాలాని నిర్ణయించుకున్నారు. కిడ్నీ డయాలసిస్‌తో పాటు సిఆర్ఆర్ థెరఫీకి కూడా స్వస్తీ చెప్పాలని నిర్ణయించుకున్నారు. సత్యసాయి రక్తపోటు, షుగర్ సాధారణంగానే ఉన్నట్లుగా నిర్ధారణ చేసుకున్నారు. సాయి మధ్యాహ్నం వరకు మరింత స్పృహలోకి వచ్చినట్లు చెప్పారు.
కాగా ఈ రోజు ఉదయం బాబా ఆరోగ్యం ఇప్పటికీ కాస్త క్లిష్టంగానే ఉందని సిమ్స్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ సఫయా బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని బులెటిన్‌లో చెప్పారు. హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ బయో కెమిస్ట్రీ నార్మల‌్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి బాబాకు వెంటిలెటర్‌తోనే కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని చెప్పారు. బాబాకు డయాలసిస్ చేసే సమయాన్ని క్రమంగా తగ్గిస్తామని చెప్పారు. బాబా స్పృహలో మార్పు కనిపిస్తుందని చెప్పారు.
No comments:
Post a Comment