BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, April 7, 2011

అప్పుడు నందమూరి-ఇప్పుడు మెగా హీరోల టెన్షన్ తో మిస్టర్ ఫర్ ఫెక్ట్ కొంచెం డిఫెక్ట్

Prabhasఛత్రపతి’తర్వాత బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్ వంటి సినిమాలు చేసినా ప్రభాస్ కి ఏదీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. బిల్లా పర్వాలేదు అనిపించింది. డార్లింగ్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ నిర్మాతను నష్టాల్లోకి నెట్టింది. డార్లింగ్ కన్ ఫర్మ్ హిట్ అని ప్రభాస్ తో సహా యూనిట్ అంతా అనుకున్నప్పటికీ అదే టైమ్ లో బాలకృష్ణ ‘సింహా’ రిలీజ్ కావడంతో డార్లింగ్ వెనక్కి వెళ్లిపోయింది. డార్లింగ్ గత ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ అవగా, సరిగ్గా సంవత్సరం తర్వాత ఏప్రిల్ 21న ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ విడుదలవుతోంది. మిస్టర్ ఫర్ ఫెక్ట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాస్ కి గత ఏడాది అనుభవమే రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.


ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ‘తీన్ మార్’ దానికి కారణం. సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చిని కొమరం పులి అభిమానుల్ని నిరాశపరచడం, ఆ వెంటనే స్టార్ట్ అయిన ‘తీన్ మార్’ ఆరు నెలల్లోనే రిలీజ్ కి రావడం ద్వారా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్కువ అటెన్షన్ క్రియేట్ చేయ్యగలిగాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం ‘తీన్ మార్’ మీదే వుంది.

మిస్టర్ ఫర్ ఫెక్ట్ మీద వారికి ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేవు అనేది నిజం. దానికి తగ్గట్టుగానే ‘తీన్ మార్’ పాటలు పెద్ద హిట్ కావడంతో డార్లింగ్ కి వచ్చిన పరిస్థితే ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ కి కూడా రాబోతోందని సినీవర్గాలు భావిస్తున్నాయి. దాంతో కాస్తా మెగా హీరోల టెన్షన్ తో మిస్టర్ ఫర్ ఫెక్ట్ కొంచెం డిఫెక్ట్ అంతాడేమోతో వేచి చూడాల్సిందే...

No comments:

Post a Comment