మూడు నిమిషాల పాట కు డ్యాన్స్ చేస్తే నాలుగు కోట్ల పారితోషికం... అంటే ఎలావుంటుంది? జాక్ పాట్ అంటే అదే అనిపిస్తుంది కదూ? ఈమధ్య బాలీవుడ్ అందాలతార దీపికా పదుకొనేకు ఇలాంటి ఆఫరే ఒకటి వచ్చిందట. ఈ వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం తను అక్షయ్ కుమార్ హీరోగా దేశి బాయేజ్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ కోసం లండన్ లో వుంది. ఈ సందర్భంగా అక్కడి ఓ ధనిక పంజాబీ కుటుంబం నుంచి దీపికాకు ఈ ఆఫర్ వచ్చింది.
ఇటీవల తాను 'దం మారో దం' సినిమాలో చేసిన ఐటెం సాంగ్ కి అవే దుస్తులు వేసుకుని తమ ప్రైవేట్ పార్టీలో డ్యాన్స్ చేస్తే అక్షరాలా నాలుగు కోట్లు ఇస్తామని ఆ పంజాబీ ఫ్యామిలీ ఆఫర్ చేసిందట. అయితే, మరొకరైతే ఆ డబ్బుకి టెంప్ట్ అయ్యేవారేమో కానీ, ప్రైవేట్ పార్టీలలో డ్యాన్స్ చేయకూడదని పాలసీ పెట్టుకున్న దీపికా అ ఆఫర్ ని తిరస్కరించిందట. మరి, ఇందులో నిజమెంతుందో కానీ, ఈ ఉదంతం మాత్రం అందర్నీ నివ్వెరపోయేలా చేసింది!
No comments:
Post a Comment