ఇక్కడ (గోవాలో).. మద్యం చౌక, మహిళలు మరింత చౌక - ఇది దమ్ మారో దమ్ హిందీ సినిమాలో హీరోయిన్ బిపాసా బసు వాడిన డైలాగ్. దమ్ మారో దమ్ ట్రైలర్‌లో ఈ డైలాగ్ ప్రధానంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో బిపాసా బసు సరసన రాణా నటించిన విషయం తెలిసిందే. బిపాసా బసు డైలాగుకు గోవా ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. అది గోవా ప్రజలను అవమానించడమేనని శివసేన నాయకుడు ఫిలిప్ డిసౌజా అన్నారు. తన జేబులు నింపుకోవడానికి నిర్మాత మరో ప్రాంతాన్ని, మరో ప్రాంత ప్రజలను ఎన్నుకుంటే తమకు అభ్యంతరం లేదని, గోవాను, గోవా ప్రజలను అవమానిస్తూ పోతే తాము సహించబోమని ఆయన అన్నారు. సెక్స్, మత్తు పదార్థాల వ్యాపారానికి గోవాను ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
గోవాలోని చాలా స్థలం ఇప్పటికే ఇతరుల చేతుల్లోకి వెళ్లిందని, గోవాలో భూములు కొన్నవారిలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారని ఆయన అన్నారు. గోవా కూతుళ్లను అమ్మడం ఆపేయాలని ఆయన అన్నారు. గోవాలో చిత్రాల షూటింగుకు అనుమతి ఇచ్చే ముందు స్క్రిప్టును పూర్తి చూడాలని, షూటింగుల అనుమతికి స్క్రిప్టును తీసుకుని చూడాలని ఆయన ముఖ్యమంత్రిని, హోం మంత్రిని కోరారు.
No comments:
Post a Comment