BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Saturday, May 7, 2011

నైట్ లైఫ్‌కు అలవాటు పడిన బిటెక్ విద్యార్థిని, ఇంట్లోనే బంగారం చోరీ

Hyderbaadహైదరాబాద్: నైట్ లైఫ్‌కు అలవాటు పడిన ఓ విద్యార్థిని తన ఇంట్లోనే చోరీకి పాల్పడింది. హైదరాబాదులోని లంగర్ హౌస్‌లో నివాసం ఉంటున్న మౌనికా రెడ్డి అనే బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థిని తన ఇంట్లోంచి 17 తులాల బంగారం దొంగతనం చేసింది. ఇంట్లో ఆమె తన తల్లితో ఉంటోంది. బంగారం పోవడంతో మౌనికా రెడ్డి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టి అనుమానంతో మౌనికా రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

బంగారాన్ని తానే ఎత్తుకెళ్లాలని, దాన్ని అమ్మి జల్సాలు చేశానని మౌనికా రెడ్డి అంగీకరించింది. విషయం తెలిసిన తల్లి నివ్వెరపోయి కన్నీరు మున్నీరవుతోంది. మౌనికా రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే, మౌనికా రెడ్డి తాను తప్పు చేశానని, మీడియా ముందు ప్రవేశపెడితే ఆత్మహత్య చేసుకుంటానని బోరుమంది. దీంతో పోలీసులు ఆమె ముఖం కనిపించకుండా మీడియాకు వివరాలు అందించారు.

No comments:

Post a Comment