కొంతమంది వ్యక్తుల విశిష్టత వలనే వాళ్లు పుట్టిన గ్రామానికి ఎంతో పేరు వస్తుంది. ఉదా:3,500సంవత్సరాల క్రితం బుద్దుడు ‘లుంబిని’ అనే గ్రామంలోనే జన్మించారు. అందుకే ‘లుంబిని’అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిగాంచింది. ‘లుంబిని’ అనే గ్రామంలో జన్మించాడు కాబట్టే హైదరాబాద్ లో లుంబినీ పార్క్ అని పేరు పెట్టారు. సుభాష్ చంద్రబోస్, అల్లూరి శీతారామరాజు, ప్రకాశం పంతులు, భగత్ సింగ్ ఇలా ఎంతో మంది వ్యక్తుల ప్రాబల్యం వలన వాళ్లు పుట్టిన ప్రదేశాలకి వెలుగులోకి వచ్చాయి.
అలాగే మహానటుడు టిడిపి రూపకర్త, 9నెలల కాలంలోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన నందమూరి తారకరామారావు నిమ్మకూరు అనే గ్రామంలో పుట్టి, ఆగ్రామానికే ఒక ప్రాముఖ్యతను, విశిష్టతను కల్పించారు. అటువంటి, నిమ్మకూరులో ఎన్టీఆర్ వారసుడైన జూ ఎన్టీఆర్ తన శోభనాన్ని చేసుకోవాలని ఉవిళ్లూరుతున్నారని తెలుస్తోంది. నిమ్మకూరులో ఎన్టీఆర్ కుటుంబానికి అచ్చొచ్చిన పందిరి మంచాన్నే, జూ ఎన్టీఆర్ తన శోభనానికి ఉపయోగించుకోనున్నారిని సమాచారం. నందమూరి వంశ వృక్షానికి నిలువెత్తు సాక్షిగా ఉన్న ఆ మంచాన్ని, అతి జాగ్రత్తగా నందమూరి వారు కాపాడుకుంటున్నారు. ముత్తాతల నుండి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని, జూ ఎన్టీఆర్ కూడా పాటించాలనీ పట్టుదలతో తన శోభనాన్ని నిమ్మకూరు గ్రామంలోనే జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment