చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే, మరో రెండు రోజుల పాటు ఆయన ఐసియులోనే ఉండాల్సి వస్తుందని వైద్య వర్గాలు శనివారం చెప్పాయి. అరవై ఏళ్ల రజనీకాంత్ ఎలర్జీక్ బ్రాంకైటిస్, జ్వరంతో బాధపడుతూ బుధవారం రాత్రి ఇసాబెల్ ఆస్పత్లిలోని ఐసియులో చేరారు.
రెండు రోజుల పాటు ఐసియులో ఉన్న తర్వాతనే రజనీకాంత్ డిశ్చార్జీపై నిర్ణయం తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. రజనీకాంత్ ఆస్పత్రి పాలు కావడం వారంలో ఇది రెండో సారి. ఏప్రిల్ 29వ తేదీన మొదటిసారి ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే, అదే రోజు సాయంత్రం ఆయనను డిశ్చార్జీ చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ రవి కుమార్ దర్సకత్వం వహిస్తున్న రాణా చిత్రంలో నటిస్తున్నారు.

No comments:
Post a Comment