BREAKING NEWS
Saturday, May 7, 2011
జూ ఎన్టీఆర్ కి మామగారు నార్నేఇచ్చిన గిప్ట్ ల విలువ కోట్లలో...
జూ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మామ నార్నే శ్రీనివాసరావు ఇచ్చిన గిప్ట్లు గురించి ప్రత్యేకంగా అందరూ చర్చించుకుంటున్నారు. ఆ గిప్ట్ ల వివరాలు ఏమిటంటే.. ఒకటి స్టూడియో ‘ఎన్’ చానెల్ లో వాటా, రెండోది..కోటి రూపాయలు ఖరీదు చేసే కారు, మూడోది జూబ్లీహిల్స్, రోడ్ నెం.31లోని కెయస్ రామారావు ఇంటిని 20కోట్లుకు ఎన్టీఆర్ కోసం కొనుగోలు చేసాడట నార్నే శ్రీనివాస్. ఈ ఇంటికి స్విమ్మింగ్ పూల్, జిమ్, 8బెడ్ రూమ్స్, 3పెద్దహాల్స్ ఉండేలా మార్పులు చేయిస్తున్నాడట ఎన్టీఆర్ మామగారైన నార్నే శ్రీనివాసరావు, ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన రెనొవేషన్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ వర్క్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి ఇక్కడే ఉంటాడని వినికిడి. ఇవన్నీ కాకుండా మరి కొన్ని ఆస్థులను ఎన్టీఆర్ కి ఇవ్వాలని శ్రీనివాస్ భావిస్తున్నాడట. ఆ వివరాలు ఇంకా బయటికి రాలేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment