చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత రాత్రి ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్‌ను చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కాళ్ల నొప్పులు, వాపులతో బాధపడుతున్నట్లు సమాచారం. రజనీకాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడం గత రెండు నెలల కాలంలో ఇది మూడోసారి.
రజనీకాంత్ మరణించినట్లు తమిళనాడులో వార్తలు గుప్పుమన్నాయి. ఆ వదంతులను రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ శుక్రవారం మధ్యాహ్నం ఖండించారు. రజనీకాంత్ బాగానే ఉన్నారని, ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆమె చెప్పారు. వదంతులు నమ్మవద్దని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. రాణా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన తరుచుగా అస్వస్థతకు గురవుతున్నారు.
కాగా, రజనీకాంత్ మరణించినట్లు వదంతులు వ్యాపించడం వెనక డిఎంకె వర్గాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉండడంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆ వదంతులను ప్రచారంలో పెట్టారని అంటున్నారు. రజనీకాంత్ అస్వస్థతతో రాణా షూటింగుకు అంతరాయం కలుగుతోంది.

No comments:
Post a Comment