పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లోంచి వ్రేలాడుతూ తుపాకీ పేలుస్తూంటే ‘కొమరంపులి’ దెబ్బకు ప్రేక్షకులు పిట్టల్లాగా ఎగిరిపోయారు. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ పోరాటాల్లో ఆకాశాన్ని అంటుతున్న టవర్లును అవలీలగా ఎక్కిపారేస్తూంటే అభిమానులు సైతం అవి ఎక్కడున్నాయో తెలిస్తే దూకేసి చచ్చిపోదాం అనుకున్నారు. ‘కొమరం పులి’కి అంతటి ఘోరమైన గ్రాఫిక్స్ అందించిన ఓ మేటి యానిమేషన్ సంస్థలోని కొందరు చురుకైన కుర్రాళ్లతోనే ఇప్పుడు ‘బద్రీనాథ్’ విజువల్ ఎఫెక్ట్స్ డిజైన్ చేయించారట.
అత్యున్నత సాంకేతిక విలువలతో, ఆడంబరంగా విడుదలకు ముస్తాబవుతున్న‘బద్రీనాథ్’లో యానిమేషన్ కీలక పాత్ర పోషిస్తున్నా గీతా ఆర్ట్స్ వారు ఈ విషయాలేవీ బయటకు పొక్కనీయకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నారో అని అప్పుడే ఇండస్ట్రీలో ఆనోటా ఈనోటా ప్రచారాలు ఎక్కువైపోయాయి. అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసిన ‘మగధీర’ చిత్రం తర్వాత దాదాపు 44కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శైవక్షేత్ర పాలకుడిగా ఓ సమురాయ్ తరహా పాత్రలో ప్రధానఆకర్షణగా కనిపించబోతున్నాడు.
అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషిస్తున్న పాత్రకూడా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందట..బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఓ ప్రత్యేకపాత్రలో కనిపించనున్న ఈ చిత్ర ఆడియో రేపు (మే 7న) శిల్పకళావేదికలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
No comments:
Post a Comment