BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Saturday, May 7, 2011

ఒసామా బిన్ లాడెన్‌ను కాల్చి చంపింది గడ్డం ఉన్న రాంబో?

Osama Bin Ladenవాషింగ్టన్: ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌పై కాల్పులు జరిపి, అతన్ని హతమార్చింది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా నేవీ సీల్స్ ఆపరేషన్ చేపట్టినప్పటికీ రాంబో లాంటి గడ్డం ఉన్న వ్యక్తి లాడెన్‌పై కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. అమెరికన్లు బిగ్ గేమ్ ఫైటర్‌గా పిలిచే రాంబో వంటి ఫైటర్ చిత్రాన్ని గీయడానికి ప్రయత్నించారు.

లాడెన్‌పై కాల్పులు జరిపిన నేవీ సీల్స్ సభ్యుడికి 26 నుంచి 33 ఏళ్ల వయస్సు ఉంటుందని వాషింగ్టన్ పోస్టు పత్రిక రాసింది. ముగ్గురు మాజీ సీల్స్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఆ పత్రిక ఆ రాంబో లాంటి సీల్ చిత్రాన్ని గీసింది. సీల్స్‌లో మహిళలు ఉండరు కాబట్టి లాడెన్‌పైకి కాల్పులు జరిపింది పురుషుడేనని చెబుతున్నారు. అతను శ్వేతజాతీయుడని, తనకు సవాళ్లు ఎదురు కాని సమయాల్లో కూడా ప్రమాదంలోకి వెళ్లి పని పూర్తి చేస్తాడని అంటున్నారు.

అతను ఓ అథ్లెటిక్ లాగా ఉంటాడని, వేగమూ చురుకుదనమూ అతనికి లభించిన వరాలని అంటున్నారు. అతని శరీరాకృతి గురించి చెప్పడానికి వాషింగ్టన్ పోస్టు ప్రయత్నించింది. కళాశాలల్లో ఫుట్‌బాల్ స్టడ్సే ఎక్కువగా సీల్స్‌గా ముందుకు వస్తారని చెబుతున్నారు.

No comments:

Post a Comment