BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, February 15, 2011

సోషియో ఫాంటసీ చిత్రం కదా అందుకే నాలుగు గెటప్స్ అంటున్ననాగార్జున

Damarukam‘సోషియో ఫాంటసీ చిత్రం చేయాలన్న నా కోరిక ఆర్.ఆర్. మూవీ మేకర్స్ ద్వారా నెరవేరుతోంది. శ్రీనివాసరెడ్డి చెప్పిన కథ బాగా నచ్చింది. ఇందులో నాలుగు రకాల గెటప్స్‌లో కనిపిస్తాను. నా పాత్ర వెస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడుతుంది. సరికొత్తగా, స్టయిలిష్‌గా ఉండే చిత్రం ఇది’’ అన్నారు నాగార్జున. ఆయన హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్‌పై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘డమరుకం’. హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆరంభమైన సందర్భంగా నాగార్జున పై విధంగా స్పందించారు.

మొట్టమొదటి షాట్‌కి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా, డి. రామానాయుడు క్లాప్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ పూజలో పాల్గొనగా, ఎస్వీ కృష్ణారెడ్డి స్క్రిప్ట్ అందించారు. ‘‘దాదాపు ఏడాదిగా శ్రీనివాసరెడ్డి ఒక తపస్సులా ఈ కథ తయారు చేశారు. వెంకట్, నాగార్జునగార్లకు ఈ కథ బాగా నచ్చింది. నిర్మాణ విలువలపరంగా గొప్ప స్థాయిలో ఉండే చిత్రం ఇది’’ అని అచ్చిరెడ్డి అన్నారు. ‘‘‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’ సమయంలో వెలిగొండ శ్రీనివాస్ చెప్పిన ఈ లైన్ నచ్చి వెంకట్‌గారికి చెప్పాను.

నాగార్జునగారికి చెప్పమని ఆయనే అన్నారు. కొత్తదనాన్ని, కొత్తవారిని ప్రోత్సహించడానికి నాగార్జునగారు ఎప్పుడూ ముందుంటారు. చిన్న చిన్న కామెడీ సినిమాలు చేస్తున్న నాకు ఈ అవకాశం రావడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ చిత్రకథ మొదటిసారి వినగానే అందరికీ నచ్చింది. ‘డమరుకం’ గొప్ప చిత్రం అవుతుందనడానికి ఇదొక నిదర్శనం’’ అని శ్రీనివాసరెడ్డి చెప్పారు. మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉన్న చిత్రం ఇది అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర ఛాయాగ్రాహకుడు చోటా కె.నాయుడు, వి.సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. నాగార్జున, అనుష్క, ప్రకాష్‌రాజ్, సోనూ సూద్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, అలీ, రఘుబాబు, ఎమ్మెస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, ఆర్ట్: అశోక్, ఎడిటింగ్: గౌతంరాజు, డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

No comments:

Post a Comment