హైదరాబాద్: ఇప్పటి వరకు మనకు నిత్య పెళ్ళి కొడుకుల వ్యవహారమే తెలుసు, తాజాగా నిత్య పెళ్ళికూతుళ్ల వ్యవహారం ఒకటి వెలుగు చూసింది. పెళ్ళిల్లు చేసుకుని ఆస్తులు కాజేసి టోకరా ఇచ్చే తల్లీకూతుల్లను హైదరాబాదులోని పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివకుమారి తాను మూడు పెళ్ళిల్లు చేసుకోవడమే కాకుండా తన కూతురు నాగలక్ష్మికి కూడా మూడో పెళ్ళి చేస్తూ పోలీసు వలకు చిక్కింది. ఈ తల్లీకూతుళ్లు గుంటూరు జిల్లా మండపేటకు చెందినవారు. వారు ఇటీవలే హైదరాబాదు చేరుకున్నారు. నాగలక్ష్మి చైతన్య అనే వ్యక్తిని మూడో పెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా మోసం బయటపడింది. పెళ్ళికి ముందే మూడో భర్త నుంచి శివకుమారి రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది.
చైతన్య ఫిర్యాదు మేరకు తల్లీకూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివకుమారి మూడో భర్త జగన్నాథరాజు. 1999లో నాగలక్ష్మి నాగరాజు అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని, భూమి, నగలు, నగదు కాజేసి పరారైనట్లు తెలుస్తోంది. 2003లో ఆనందరాజు చౌదరి అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని అదే రీతిలో పరారైనట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాదులోని చైతన్య అనే వ్యక్తికి నాగలక్ష్మితో వివాహం చేయడానికి ప్రయత్నిస్తుండగా శివకుమారి వ్యవహారం బయటపడినట్లు సమాచారం.
No comments:
Post a Comment