న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినట్టు సూచనప్రాయంగా తెలుస్తోంది. జగన్ ఇటీవల దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేరుపై వైయస్ఆర్ పార్టీ, వైయస్ఆర్ ప్రజా పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికల సంఘం వైయస్ఆర్ పార్టీ పేరును ఆమోదిస్తున్నట్టు ఓ లేఖను జగన్‌కు పంపించినట్టుగా తెలుస్తోంది. దీనికి అధ్యక్షుడిగా వైయస్ జగన్ పేరును ఉంచారు.
కాగా కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ లోపు సిఈసి నుండి తన పార్టీకి అనుమతి రాకపోతే ఇప్పటికే శివకుమార్ అధ్యక్షుడిగా రిజిస్టర్ అయి ఉన్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేసే ఉద్దేశ్యంతో శివకుమార్‌తో ఇటీవలే సమావేశమయ్యారు. అయితే ఇప్పుడు వైయస్ఆర్ పార్టీ పేరుకు అనుమతి వచ్చినందువల్ల జగన్ ఏ పార్టీ పేరిట పోటీ చేస్తారో నిర్ణయించుకోవాల్సి ఉంది. అయితే పార్టీ గుర్తును ఇంకా ఖరారు చేయనట్టుగా తెలుస్తోంది.
No comments:
Post a Comment