తెలుగులో వడివడి అందాలను ఆరబోయడంతో మంచి అవకాశాలే వస్తున్నాయి అమ్మడుకి. ఏకాంతం నచ్చదని నటి ప్రియమణి అంటోంది. ఒంటరిగా ఉంటే ఎలాంటి సంతోషమూ ఉండదని చెబుతోంది. పరుత్తివీరన్ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నా ఎందుకనో ఆమెను తమిళ చిత్రపరిశ్రమ పట్టించుకోలేదు. ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడమే దీనికి కొంత కారణం కావచ్చు. కోలీవుడ్ పక్కన పెట్టిన ఈ భామను టాలీవుడ్ ఆదుకుంది.
తెలుగులో వడివడి అందాలను ఆరబోయడంతో మంచి అవకాశాలే వస్తున్నాయి అమ్మడుకి. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ నటనలోకి వచ్చిన తరువాత నిబంధనలు విధించడం తనకు నచ్చదంటోంది. ఎలాంటి పాత్ర అయినా నటించడానికి సిద్ధమని, ఒక పాత్రను అంగీకరించిన తర్వాత అందులో ఒదిగిపోవడానికి ప్రాముఖ్యతనిస్తానని అంటోంది. అవార్డుల లక్ష్యంతో ఏ పాత్రనూ ఒప్పుకోనని అంటున్న ఈ నెరజాన పార్టీలకెళ్లడం చాలా ఇష్టమని చెబుతోంది.
No comments:
Post a Comment