వేదం చిత్రంలో అల్లు అర్జున్ తో రోమాన్స్ చేసిన దీక్షాసేథ్ ని అందరు ఇప్పుడు టాలీవుడ్ కత్రినా అంటున్నారు. వేదం తర్వాత రవితేజతో మిరపకాయ్, గోపీచంద్ తో వాంటెడ్ చిత్రాలు చేస్తున్న ఈ భామ పర్సనాలిటీ అందర్నీ అలరిస్తుంది. ముఖ్యంగా ఈ భామకు హైట్ చాలా ప్లస్ అనడంలో ఎటువంటి ఆచ్చర్యం లేదు. ఇటీవల జరిగిన వాంటెడ్ ఆడియో వేడుకలో హాట్ హాట్ గా వచ్చిన ఈ భామ అందరి దృష్టిని అలరించింది. ఈ వేడుకలోనే బ్రహ్మానందం దీక్షాసేథ్ పై మనసు పారేసుకొని టాలీవుడ్ కత్రినా కైఫ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ తర్వాత అందరూ ఆలోచిస్తే నిజంగానే ఈ ముద్దుగుమ్మ లో అలాంటి పోలికలు కనిపించాయట.
No comments:
Post a Comment