BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, January 16, 2011

ఆ భగవంతుడ్ని ఒకటే కోరుకుంటున్నానంటున్న స్టార్ హీరోయిన్

ఆ భగవంతుడ్ని ఒకటే కోరుకుంటున్నానంటున్న స్టార్ హీరోయిన్....

Kajal Agarwal 

 మన సంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా పండగలు జరుపుకోవడం అంటే మహా ప్రీతి. సినిమాల్లోకి రాకముందు అన్ని పండగలూ జరుపుకునేదాన్ని. అయితే ఒక్కోసారి షూటింగ్స్ ఉండటంవల్ల పండగలు మిస్ అవుతున్నాను. లక్కీగా ఈసారి షూటింగ్ లేదు. అందుకని ముంబయ్ వెళ్లాను. సంక్రాంతి పండగను చాలా గ్రాండ్‌గా జరుపుకుంటున్నాం. మా పంజాబీలం సంక్రాంతి పండగను ‘లోరి’ అంటాం.

లోరీనాడు పోటీలు పడి మంటలు వేస్తాం. సరదా కోసం మొదలుపెట్టే ఈ మంటల తతంగం చివరికి పోటీగా మారుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద మంట వేస్తే అంత బాగా లోరీ చేసుకున్నట్లు. ఇంకో విషయం ఏంటంటే.. మంటల్లో పేలాలు, బియ్యం, నువ్వులు వేస్తాం. ఇక సంక్రాంతికి ‘ముగ్గులు’ సందడి ఎలానూ ఉంటుంది.

మా అమ్మ నువ్వుల లడ్డు, గారెలు, చక్రపొంగలి చేస్తుంది. అవన్నీ ఇష్టంగా లాగించేస్తా. ఇక పండగ సందర్భంగా ఆ భగవంతుడ్ని ఒకటే కోరుకుంటున్నా. నా చెల్లెలు నిషా, నా కెరీర్ ఇంకా బ్రైట్‌గా ఉండాలని, మాకు ఇంకా గుర్తింపు రావాలని ఆశిస్తున్నా. అలాగే అందరి జీవితాలూ ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను.

 

No comments:

Post a Comment