ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, January 16, 2011
రవితేజ బాలయ్యను పొడిచేంత మొనగాడేం కాదు....
రవితేజ బాలయ్యను పొడిచేంత మొనగాడేం కాదు....
దాదాపు రెండేళ్ళ క్రితం బాలకృష్ణ, రవితేజ సినిమాలు సంక్రాంతి పోటీలో నిలిచాయి. రవితేజ నటించిన ‘కృష్ణ’ సక్సెస్ అయ్యి బాలయ్య యాక్ట్ చేసిన ‘ఒక్క మగాడు’ ఘోరపరాజయం పాలయ్యింది. దాంతో రవితేజ తన గురించి ఎక్కువగా ఊహించుకున్నాడు. ఇక ఈ యేడాది కూడా బాలయ్య ‘పరమవీర చక్ర’, రవితేజ ‘మిరపకాయ్’ సంక్రాంతి బరిలో నిలిచాయి. బాలయ్య పోటీగా తీసుకోలేదుగానీ..రవితేజ మాత్రం ఈ యేడాది కూడా గెలుపు తనదేనని ఫిక్స్ అయ్యాడు.
బాలయ్యను ఓడించాలన్నదే ఇతని టార్గెట్. తన సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని రవితేజ చెప్పుకుంటూ వచ్చాడట. అంత విర్రవీగాడు కాబట్టే ‘మిరపకాయ్’ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అఫ్ కోర్స్ ‘పరమవీర చక్ర’కు కూడా ఈ టాకే ఉందనుకోండి. కానీ బాలయ్య బాగా యాక్ట్ చేసాడని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే ‘మిరపకాయ్’లో రవితేజ నటన కొత్తగా లేదని..అతని గత సినిమాల మాదిరిగానే ఉందని విమర్శిస్తున్నారు. సో..తన అనుకున్నట్లు రవితేజ సంక్రాంతి మొనగాడు కాదు..
No comments:
Post a Comment