ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, January 16, 2011
అసభ్య నృత్యాలు చేస్తున్న పెద్దాపురం ఆరుగురు యువతులు అరెస్టు......
అసభ్య నృత్యాలు చేస్తున్న పెద్దాపురం ఆరుగురు యువతులు అరెస్టు......
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలో అసభ్య నృత్యాలు చేస్తున్న ఆరుగులు యువతులతో పాటు, 30మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజానగరం మండలం కానవరం గ్రామం శివారులోని జీడి మామిడి తోటలో 30 మంది యువకులు పెద్దాపురం, కాకినాడ, రాజమండ్రినుండి తీసుకు వచ్చిన ఆరుగురు యువతులతో అసభ్యకర డాన్సులతో అర్ధరాత్రి ఎంజాయ్ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు.
పోలీసులు రైడ్ చేసి యువతులను, యువకులను అరెస్టు చేశారు. ఈ రైడింగ్‌లో పోలీసులు 7కార్లు, 1 మోటారు సైకిల్, 27 సెల్‌ఫోన్లులతో పాటు 37వేలకు పైగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. భోగమేళాలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేశారు. పాల్గొన్న యువకులంతా ఉన్నత కుటుంబీకులేనని సమాచారం.
No comments:
Post a Comment