ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, January 16, 2011
నయన తార కు తెలియకుండా ఆమెపై బిజినెస్ మొదలెట్టిన ప్రభుదేవా..
నయన తార కు తెలియకుండా ఆమెపై బిజినెస్ మొదలెట్టిన ప్రభుదేవా..
గత సంవత్సరంగా ప్రభుదేవా, నయనతార జీవితంలో ఎన్నోన్నో మలుపులు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజుల క్రితం ప్రభుదేవా భార్య కోర్టు ఆవరణంలో పెద్దమనుష్యుల సమక్షంలో కొన్ని భేషరత్తులతో విడాకులకు అంగీకరించిందన్న విషయం విధితమే. అయితే విడాకులకు అంగీకరించినందుకు భార్య రామలత్ కు ప్రభుదేవా32 కోట్ల రూపాయలు కట్టబెట్టబోతున్న విషయం తెలిసిందే. దాంతో అతను ఆర్థక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
ఇప్పటికే నయనతార నుంచి కూడా డబ్బులు తీసుకుని ఖర్చు పెడుతున్నాడట. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవ్వాలని నయనతార అనుకుంటోంది. కానీ ఆమెకు తెలియకుండా ఓ నిర్మాత దగ్గర్నుంచి ప్రభుదేవా అడ్వాన్స్ తీసుకున్నాడట. నయనతారతో కథానాయికగా నటింపజేస్తానని మాటిచ్చాడట కూడ. ఈ విషయం తెలిసిన నయనతార చేసేదేమీ లేక ప్రభునీ ఏమీ అనకుండా చేస్తానని చెప్పిందట. మరి ఇదంతా చూస్తుంటే డబ్బు ‘మాయో’ ప్రే‘మాయ’ ముందు ముందు నయనతార జీవితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే...
No comments:
Post a Comment