BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, January 16, 2011

భాను కిరణ్ బినామీలు అమ్మాయిలే, ప్రముఖుల పేర్లూ బయటకు?

భాను కిరణ్ బినామీలు అమ్మాయిలే, ప్రముఖుల పేర్లూ బయటకు?

 

Bhanu Kiran 

 హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. సూరి పక్కన పెట్టి స్వతంత్రంగా దందాలు చేసిన భాను కిరణ్ తన ఆస్తులకు అమ్మాయిలను బినామీలుగా ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. భాను కిరణ్ సెల్‌లో దాదాపు వంద మంది అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు పోలీసు విచారణలో తేలిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనూష అనే ఓ అమ్మాయి ఫోన్‌లో భానుతో తనకు గల పరిచయంపై టీవీ చానెళ్లతో వివరించింది. భాను కిరణ్ అమ్మాయిలతో ఓ రిసార్టులో తరుచుగా గడుపుతుండేవాడని చెప్పి సూరి డ్రైవర్ మధు ఆ రిసార్టును కూడా పోలీసులకు చూపించినట్లు వార్తలు వచ్చాయి.

కాగా, భానుదిగా భావిస్తున్న ల్యాప్‌టాప్‌ను పోలీసులు ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపినట్లు తెలుస్తోంది. అది తెరుచుకుంటే భాను సంబంధాలపై మరిన్ని విషయాలు తెలుస్తాయని అంటున్నారు. పలువురు ప్రముఖుల గుట్టు దాని ద్వారా బయటపడవచ్చునని అంటున్నారు. సినీ ప్రముఖులతో భాను పరిచయాలు దాని ద్వారా వెల్లడి కావచ్చునని చెబుతున్నారు. సినీ నిర్మాత సి. కళ్యాణ్‌ను పోలీసులు ఇప్పటికే రెండు సార్లు గంటల తరబడి విచారించారు. మరింత సినీ ప్రముఖులను కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. భాను కిరణ్ ల్యాప్‌టాప్‌ను తెరిచిన తర్వాత చాలా విషయాలు బయట పడవచ్చునని భావిస్తున్నారు.

ఇదిలా వుంటే, సూరి హత్యకు ఐదు గంటల ముందు భాను, అతని అనుచరులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యాంకుల నుంచి 60 లక్షల రూపాయల దాకా డ్రా చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. భాను, అతని అనుచరుల పేరు మీద 18 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. సూరి హత్యకు ఐదు గంటల ముందు విజయవాడలోని ఓ బ్యాంక్ నుంచి 18 లక్షలు, హైరాబాదులోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ బ్యాంకుల నుంచి 8 లక్షల రూపాయలు, మెదక్ జిల్లాలోని ఓ బ్యాంక్ నుంచి 13 లక్షల రూపాయలు, మహబూబ్‌నగర్‌లోని ఓ బ్యాంకు నుంచి 20 లక్షల రూపాయలు డ్రా చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ డబ్బులు హవాలా రూపంలో దుబాయ్ చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, భాను కిరణ్ ఐసిఐసిఐ బ్యాంకు నుంచి స్కోడాలారా కారు కొనుగోలుకు ఏడు లక్షల రూపాయల అప్పు తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఎనిమిది నెలల పాటు వాయిదాలు సక్రమంగా చెల్లించాడని, ఆ తర్వాత డిఫాల్టర్‌గా మారాడని, దాంతో మార్కెట్ ఏజెంట్లు ఆ కారును రికవరీ చేసుకున్నారని, వారిని బెదిరించి భాను కిరణ్ తిరిగి కారు తెచ్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది. బ్యాంకుకు అతను ఇంకా ఆరు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని భానుకు బ్యాంక్ నుంచి నోటీసు కూడా వచ్చినట్లు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి.

 

No comments:

Post a Comment