ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Saturday, January 29, 2011
మహేష్ బాబు రూట్ లో జూ ఎన్టీఆర్..రచ్చ..
మహేష్ బాబు రూట్ లో జూ ఎన్టీఆర్..రచ్చ..
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఆరంభంకానుంది. కాగా ఈ సినిమాకి ‘రచ్చ’ అనే టైటిల్ ని పెట్టాలనుకున్నారు. ఈ టైటిల్ ని ఆల్ రెడి సంపత్ నంది రిజిస్టర్ చేసుకుని రవితేజతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నేపద్యంలో ఎన్టీఆర్ సినిమాకి ‘తారక్ రచ్చ’ అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కళ్యాణ్ రామ్ ‘కత్తి’ టైటిల్ వివాదంలో ఇరుక్కుని తర్వాత కళ్యాణ్ రామ్ కత్తి అని మార్చుకొని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబు ‘ఖలేజా’ కూడా ‘మహేష్ ఖలేజా’ గా విడుదలైన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ‘రచ్చ’ కూడా వివాదం అవుతుందని ముందుగానే గ్రహించి ఈ చిత్రానికి ‘తారక్ రచ్చ’ అని మారుస్తున్నారేమో..త్వరలోనే ఈ టైటిల్ కి సంబందించి జూ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.
No comments:
Post a Comment