ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Saturday, January 29, 2011
2011లో చిన్న బడ్జెట్‌తో అద్బుతమైన విజయం అలా మొదలైంది
2011లో చిన్న బడ్జెట్‌తో అద్బుతమైన విజయం అలా మొదలైంది2011లో విడుదలైనటువంటి అన్ని సినిమాలలో కెల్లా మొట్టమొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అలా మొదలైంది. సినిమా విడుదలైన తర్వాత మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టడమే కాకుండా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దాంతో అలా మొదలైంది ప్రింట్లు, ధియేటర్లు ఒక్కసారిగా పెంచడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ ఈసినిమాన్ని బాగా ఆదరిస్తున్నారని నిర్వాత దామోదర ప్రసాద్ వెల్లడించారు.
సాధారణంగా ఎప్పుడూ ఏ సినిమా చూసిన మాట్లాడని దర్శకేంద్రుడు రాఘవేంద్రారవు ఈచిత్రాన్ని చూసి తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. అది మాత్రమే కాకుండా చిన్న సినిమా తీసి పెద్ద హిట్ కోట్టాలి అనే ఉద్దేశ్యం ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్‌కి లభించినటువంటి అద్బుత విజయమని ప్రశంసించారు. ఇక ఈసినిమా డైరెక్టర్ నందిని రెడ్డి మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నారు.
ఇక ఈసినిమాలో నటించినటువంటి హీరో, హీరోయిన్ ఇద్దరూ ఒకరికోకరు పోటీపడి నటించారు. ముఖ్యంగా నాని యాక్షన్ ఐతే చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా హీరోయిన్ నిత్యామీనన్ తన అందచందాలు, అభినయంతో ప్రేక్షకులను ధియేటర్లుకు బాగానే రప్పిస్తున్నారు. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజీని సంపాదించుకుంది అలా మొదలైంది. చివరగా ఈసినిమా నిర్మాత మాట్లాడుతూ త్వరలో మాబ్యానర్‌లో మరో మూడు చిత్రాలు నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో ఒకటి పెద్ద హీరోతో ఉంటుందని, ఇంకోకటి కొత్తవారితో చేస్తామని తెలిపారు.
No comments:
Post a Comment