ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Saturday, January 29, 2011
స్టార్ హీరోల కన్నంతా మహేష్ ‘బిజినెస్ మ్యాన్’ పైనే...
స్టార్ హీరోల కన్నంతా మహేష్ ‘బిజినెస్ మ్యాన్’ పైనే...
మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంత ఎక్సైట్ అవుతున్నారో, అంతకు రెండింతలు పరభాషా హీరోలు ఎలర్ట్ అయ్యారు. ‘పోకిరి’ సినిమాని పలు భాషల్లోకి రీమేక్ చేసుకుని లాభపడ్డ హీరోలంతా ఇప్పుడు ‘ది బిజినెస్ మ్యాన్’సినిమాపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమిళంలో విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో దర్శన్..ఈ సినిమా రైట్స్ తీసుకోవడానికి ముందు కర్చీఫ్ వేస్తే మంచిదని భావిస్తున్నారు.
అయితే ఈ సినిమాపై సందేహాలు కూడా బాగానే వ్యక్తమవుతున్నాయి. సహజంగా ఇలా కాంబినేషన్ రిపీట్ అయినప్పుడు తమ కలయికలో వచ్చిన ముందు సినిమా రికార్డులు కొట్టడానికి ప్రయత్నించి భంగపడుతుంటారు. పోకిరిని కొట్టబోయి పూరి ఆంధ్రావాలానిస్తే మహేష్ ఖలేజా ఏంటో అభిమానులు ఇంకోసారి చూడాల్సి రావచ్చు..
No comments:
Post a Comment