ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Saturday, January 29, 2011
జ్యోతిష్కుడి కామకేళీ గుట్టు రట్టు, మహిళలతో అసభ్య ప్రవర్తన
జ్యోతిష్కుడి కామకేళీ గుట్టు రట్టు, మహిళలతో అసభ్య ప్రవర్తన
కోయంబత్తూరు: కేరళలో ఓ జ్యోతిష్కుడు కామకేళీలకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. కాషాయం, జ్యోతిష్యం ముసుగులో కామకేళికి పాల్పడుతున్న ఈశ్వరన్ జ్యోతిష్కుడి గుట్టురట్టయింది. కేరళలోని కోవై జిల్లా తెలుగుపాళెం సమీపంలోని సీజీవీనగర్‌కు చెందిన ఈశ్వరన్ జ్యోతిషం పేరుతో ఓ నిలయాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఆయన చెప్పిన కొన్ని నిజం కావడంతో ప్రజలకు నమ్మకం ఏర్పడింది. దీంతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఈ జ్యోతిష్కుడు మహిళలతో కాస్త విపరీతంగా ప్రవర్తించేవాడు. ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ వారిని వలలో వేసుకునే ప్రయత్నాలు చేసేవాడు.
ఈ నేపథ్యంలో ఇటీవల జ్యోతిషం కోసం వచ్చిన సెల్వపురానికి చెందిన చంద్రిక , భాగ్యలక్ష్మిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. వారు నగర పోలీసు కమిషనర్ శైలేంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈశ్వరన్‌ను అరెస్టు చేసి నీలిచిత్రాల సీడీలు, నకిలీ యంత్రరేకులు, డాక్టరేట్ పొందినట్టు ఉన్న నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో ఈశ్వరన్ ఒప్పుకున్నాడు.
No comments:
Post a Comment