‘రాణా’గా త్రిపాత్రాభినయం లో అలరించనున్న సూపర్ స్టార్..
రోబో’ చిత్రంతో భారత చలనచిత్ర చరిత్రలో సంచలనం రేపిన సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ఏంటనే ఉత్కంఠకు తెరపడింది. ఆయన రాణాగా తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన హిట్ చిత్రాలు ‘ముత్తు’ నరసింహా, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కేఎస్ రవికుమార్ నేతృత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ చిత్రంలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం.
గతంలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన ‘మూండ్రముగ’చిత్రం భారీ మిట్ కొట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రానున్నఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. రోబో చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు. రోబో చిత్రానికి పని చేసిన ఛాయాగ్రహకుడు రత్నవేలు ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు
No comments:
Post a Comment