ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, January 30, 2011
మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను అనుచరులకు రిమాండ్
మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను అనుచరులకు రిమాండ్
హైదరాబాద్: మద్దలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ అనుచరులను పోలీసులు ఆదివారం రిమాండుకు తరలించారు. భాను అనుచరులుగా ఉన్న సుబ్బయ్య, హరి, మన్మోహన్ సింగ్, వెంకటరమణలను ఆదివారం 12వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వీరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కాగా నిందితులు మద్దెలచెర్వు హత్య కేసులో ఛేదనకు సరిగా పోలీసులకు స్పందించడం లేదని తెలుస్తోంది. మద్దెలచెర్వు సూరి హత్య అనంతరం ఒక్కొక్కరు పోలీసులుకు దొరికి పోయారు. అదే రీతిలో భాను కూడా త్వరలో దొరుకుతాడని పోలీసులు భావిస్తున్నారు. భాను వద్ద డబ్బులు కూడా అయిపోయాయని అందుకే దొరికే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దక్షిణ భారత్‌లోనే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment