BREAKING NEWS
Sunday, January 30, 2011
వైఎస్‌పై కామెంట్స్‌పై రిపీట్ చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి
అనంతపురం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై తాను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను ఆదివారం రిపీట్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ ఆదివారం అనంతపురం జిల్లా రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంత స్థాయికి ఎదిగారన్నారు. కాంగ్రెస్ అండతో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి లక్షలాది, కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. వైఎస్ అంతపెద్ద నాయకుడయ్యాడంటే కారణం కాంగ్రెస్ అని చెప్పారు. వైఎస్ అసంపూర్తి చేసిన ప్రజా సంక్షేమ పథకాలను పూర్తి చేయడానికే అధిష్టానం నన్ను ముఖ్యమంత్రిగా నియమించిందని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment