BREAKING NEWS
Sunday, January 30, 2011
అవినీతి ఆరోపణలు తప్పించుకోవడానికే జగన్ పోలవరం యాత్ర: విహెచ్
హైదరాబాద్: అవినీతి, హత్యారోపణల కేసుల ఆరోపణలనుండి తప్పించుకోవడానికే మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం పాదయాత్ర చేపడుతున్నారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆదివారం ఆరోపించారు. ఆయన చేస్తున్న లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్షలు అధికారం కోసమేనని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులకు గానీ, జగన్‌కు గానీ ప్రజా సమస్యలపట్ల చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment