BREAKING NEWS
Sunday, January 30, 2011
హత్య కుట్రపై డికె అరుణ డోంట్‌కేర్: లైట్‌గా తీసుకున్న మంత్రి
మహబూబ్‌నగర్: తనపై అగంతకులు చేసిన హత్యను మంత్రి డికె అరుణ లైట్‌గా తీసుకున్నారు. తనపై హత్యా కుట్రను అంతగా సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న తనను భయపెట్టాలనే ప్రయత్నం విజయవంతం కాదని ఆమె అన్నారు. నేను ఎవరి బెదిరింపులకు భయపడనని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తానన్నారు. ఎవరో భయపెడితే భయపడేదానిని కాదన్నారు. అయితే తనకు వచ్చిన బెదిరింపు కాల్సుపై కుటుంబ సభ్యులు భయపడుతున్నారన్నారు. అది ఎవరికైనా సహజమేనన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment