ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, January 30, 2011
వోల్క్స్‌వ్యాగన్ వండర్ కార్..: లీటర్‌కు వంద కిలోమీటర్ల మైలేజీ
వోల్క్స్‌వ్యాగన్ వండర్ కార్..: లీటర్‌కు వంద కిలోమీటర్ల మైలేజీ
నానాటికీ పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలను చూసి వాహనచోదకులు బెంబేలెత్తిపోతుంటే.. కొత్తగా వాహనాలు కొనాలనుకునే వారు వెనకడుగు వేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క లీటర్ డీజిల్‌కు వంద కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే కారు దొరికితే ఎలా ఉంటుంది...?
కారేంటి..? లీటరు డీజిల్‌కు 100 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వడం ఏంటీ అసాధ్యం అనుకుంటున్నారా.. అస్సలు లీటరకు 100 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగల కారును మనం కలలో కూడా ఊహించుకోగలమా అని కొట్టిపారేయకండి. ఎందుంకంటే అచ్చం అలాంటి కారునే జర్మనీకు చెందిన ఆటోమొబైల్ సంస్థ "వోల్క్స్‌వ్యాగన్" తయారు చేసి రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఇటీవల ఖతార్‌లో జరిగిన ఓ మోటార్ షోలో ఈ హైబ్రిడ్ కారున ప్రదర్శనకు ఉంచింది.
ఖతార్‌లో నిర్వహించిన ఆటో షోలో ప్రపంచం నలుమూలల నుంచి కార్ల కంపెనీలు తరలి వచ్చి తమ తమ లేటెస్ట్ డిజైన్లను ప్రదర్శనకు ఉంచాయి. కాగా.. వీటన్నింటిలోకి వోల్క్స్‌వ్యాగన్ సంస్థ ప్రదర్శించిన లీటరుకు వంద కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే "ఎక్స్ఎల్ 1" కారు ప్రధాన ఆకర్షణగా నిలిచి చూపరుల మది దోచుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. త్వరలోనే ఈ కారను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే ఈ కారు ధరను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.
వోల్క్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్ 1 కారు వివరాలు: వోల్క్స్‌వ్యాగన్ 12 ఏళ్ల పరిశోధన ఫలితమే ఈ ఎక్స్ఎల్ 1 కారు. ఈ కారు తయారీకు 2002లో శ్రీకారం చుట్టారు. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది డీజిల్/బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది. ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 99 మైళ్లు. ఈ కారు తక్కువ బరువు ఉండే విధంగా దీనిని కార్బన్ ఫైబర్‌తో రూపొందించారు. దీని హార్స్‌పవర్ 47 హెచ్‌పి, ఇంజన్ సామర్థ్యం 800 సీసీ, దీనిని 2-సిలిండర్ టర్బో డీజిల్ డిడిఐ ఇంజన్‌తో పాటు 27 హెచ్‌పి సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ ఇంజన్‌తో రూపొందించారు. ఇది బ్యాటరీ మరియు డీజిల్‌పై నడుస్తుంది. ఒక్క బ్యాటరీ పవర్‌తోనే ఇది 22 మైళ్ల దూరం ప్రయాణించగలదు.
No comments:
Post a Comment