BREAKING NEWS
Sunday, January 30, 2011
గోపీచంద్ కొత్త చిత్రం టైటిల్ ‘మొగుడు’!
గోపీచంద్ , కృష్ణవంశీ కాంబినేషన్ లో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మొగుడు’ (హజ్బెండ్) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రం హీరో గోపీచంద్. వాంటెడ్ చిత్రం ప్లాప్ తో ఉన్న గోపీచంద్ ఈ కాంబినేషన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో గోపీచంద్ తో లక్ష్యం చిత్రం నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం బుజ్జి ఆఫీసులో ఈ కొత్త ప్రాజెక్టుకు సంభందించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక కృష్ణవంశీ కి నాగార్జున, రామ్ చరణ్ లతో కమిట్మెంట్స్ ఉన్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment