BREAKING NEWS
Friday, January 21, 2011
హీరోతో ప్రేమాయణం నడిపి, అతన్ని కొట్టించిన శ్వేతారెడ్డి?
హైదరాబాద్: టీవీ న్యూస్ చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న శ్వేతారెడ్డి చిక్కుల్లో పడింది. శ్వేతారెడ్డికి చెందిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు గురైన మద్దెలచెర్వు సూరి, భాను కిరణ్ ఆస్తులకు ఆమె బినామీగా వ్యవహరించడమే కాకుండా తీవ్రమైన పనులకు పాల్పడినట్లు తెలుస్తోంది. శ్వేతారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. దీంతో ఆమెను టీవీ చానెల్ ఉద్యోగం నుంచి తొలగించింది. శ్వేతారెడ్డి ఓ హీరోతో ప్రేమాయణం నడిపినట్లు సమాచారం. ఆ ప్రేమాయణం పెళ్లి దాకా వెళ్లింది. కానీ, శ్వేతారెడ్డికి తన పెట్టుబడులు ఉన్న ల్యాబ్‌లోని ఓ వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానాలు రావడంతో హీరో గొడవ పడ్డాడని తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment