ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Friday, January 21, 2011
భాను కిరణ్ అనుచరుడు సజ్జల కేశవ్ ను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసు
భాను కిరణ్ అనుచరుడు సజ్జల కేశవ్ ను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసు...
అనంతపురం: మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అనుచరుడుగా భావిస్తున్న సజ్జల కేశవ్ ను సిసిఎస్ పోలీసులు శుక్రవారం అనంతపురం లో అరెస్టు చేశారు. సజ్జల కేశవ్ ద్వారా భాను గురించి మరిన్ని ఎక్కువ వివరాలు సేకరించవచ్చునని పోలీసుల భావిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో పోలీసులు కేశవ్ ను అరెస్టు చేశారు. కేశవ్ వస్త్ర వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. సజ్జల కేశవ్ కు భాను కిరణ్ ఆర్థికంగా కూడా బాగా సహకరించినట్లుగా సమాచారం. అనంతపురం జిల్లా వాసి అయిన కేశవ్ కు బెంగుళూరులో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
బెంగుళూరు దగ్గరగా ఉండటంతో ఆయన తన వ్యాపారాన్ని హైదరాబాదు కంటే బెంగుళూరులోనే ఎక్కువగా విస్తరించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేశవ్ కు ఎక్కడ ఎక్కడ ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయనే విషయం రేపటి వరకు తెలియవచ్చు. కేశవ్ ను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాదుకు తరలించారు. సూరి హత్యకు రెండు మూడు రోజుల ముందునుండి భానుకిరణ్ కేశవ్ కే అత్యధికంగా ఫోన్లు చేసినట్టుగా తెలుస్తోంది.
No comments:
Post a Comment