మహేష్, శ్రీను వైట్ల 'దూకుడు' చిత్రం కథ ఇదేనా?
మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న దూకుడు చిత్రం కధ అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఒకటి గత కొద్ది రోజులుగా వినపడుతోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం...మహేష్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తూంటాడు. అతను చేతుల్లోంచి నుంచి ఓ మాఫియా లీడర్ (ప్రకాష్ రాజ్)పొలిటికల్ పవర్ ఉపయోగించుకుని తప్పించుకుని పారిపోతాడు. అతన్ని పట్టుకుని తిరిగి పది రోజుల్లోగా సరెండర్ చేయకపోతే మహేష్ వి, అతని టీమ్ వి ఉద్యోగాలు పోతాయని అతని సుపీయర్ ఆఫీసర్ (నాజర్)హెచ్చరిస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ ని పట్టుకోవాలని బయిలుదేరతాడు. ఈ లోగా ప్రకాష్ రాజ్..టర్కీలో తేలతాడు. ప్రకాష్ రాజ్ ని పట్టుకునే క్రమంలో టర్కీకి వెళ్ళిన అతనికి సమంత పరిచయమై..ప్రేమలో పడతాడు. ఆమె నాజర్ కూతురని తర్వాత తెలుస్తుంది. మరి కొంత సమయం గడిచాక అస్సలు ప్రకాష్ రాజ్ తప్పించుకుపోవటానికి డిపార్టమెంట్ లోనే ఉండి సహాయం చేసింది నాజరే నని అర్దమవుతుంది. దాంతో నాజరే విలన్ అని అర్దం చేసుకున్న మహేష్ ఎలా ప్రూవ్ చేసాడు అన్నది మిగతా కథ అంటున్నారు. ఇక ఈ చిత్రం ట్రీట్ మెంట్ ఎక్కువ భాగం కామిడీతో రన్ అవుతుంది. అలాగే ఈ కథ నిజమవ్వటానికి ఎంత అవకాశముందో కాకపోవటానికి అంతే అవకాసం ఉంది. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.
No comments:
Post a Comment